భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ దుష్టపాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉన్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఆదివారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్రావుతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
కొత్తగూడెంలోని 28వ డివిజన్, పాల్వంచలోని 11,12,13,25,49 డివిజన్లు, సుజాతనగర్లోని 22,23 డివిజన్లలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ.. ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ నాయకులకు బాకీకార్డులు చూపించి నిలదీయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతున్నదని, కేసీఆరే సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తంచేశారు.