భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల పాలనలో క నీస అభివృద్ధి చేయని, సంక్షేమ పథకాలు అందించని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కులేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. ఇచ్చిన హామీలు అమలుచేయలేక నోట్ల కట్టలతో ఓటర్ల దగ్గరకు వస్తున్నారని ఆరోపించారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లోని పలు డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం శనివారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం ఏం చేశారని ఓ ట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు సృష్టి ంచినా, కేసులు పెట్టినా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని స్పష్టంచేశారు. రేగా కాంతారావు మాట్లాడుతూ.. తమ నాయకుడు కేసీఆర్ ము మ్మాటికీ జాతిపితనే అని స్పష్టంచేశారు.