హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : పెట్రోలియం, సహజవాయు శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం మెంబర్గా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మూడోసారి నియామకమయ్యారు. లోక్సభ డిప్యూటీ సెక్రటరీ సుజయ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ స్థాయీ సంఘంలో మొత్తం 31 మంది సభ్యులు ఉంటారు. లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తా రు. కాగా స్థాయీ సంఘం చైర్మన్గా లోక్సభ ఎంపీ సునీల్ దత్తాత్రేయ తట్కారే మరోసారి నియామకమయ్యారు.