BRS Party | రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియమించారు. పార్టీ విప్‌గా ఎంపీ దీవకొండ దామోదర్రావునకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కేసీఆర్ లేఖ రాశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల బీఆర్ఎస్ అధినేత రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా సీనియర్ నేత కేఆర్ సురేశ్‌రెడ్డిని నియమించారు. పార్లమెంటరీ పార్టీ, రాజ్యసభ పక్షనేతగా ఉన్న కే కేశవరావు స్థానంలో సురేశ్‌రెడ్డిని నియమించారు. కేకే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో ఆయన స్థానంలో సురేశ్‌రెడ్డిని పార్టీ పక్షనేతగా ప్రకటించిన కేసీఆర్.. ఈ మేరకు కేఆర్ సురేశ్‌రెడ్డిని నియమిస్తూ రాజ్యసభ సెక్రటరీ జనరల్, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.