హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుందా? బీజేపీ రూల్ చేస్తుందా? అనేది అర్ధం కావడం లేదు అని రాజ్యసభ సభ్యుడు వద్ది రాజు రవిచంద్ర అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ విషయంలో కేసులు పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరీంనగర్లోని నగల షాప్లో దొంగతనం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసినా పోలీసుల చర్యలు లేవన్నారు.
ఢిల్లీ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు. పోక్సో కేసు నమోదు అయితే ప్రతి సారి సిట్ వేస్తారా? క్యాంపు కార్యాలయాలపై దాడులు మంచి సంప్రదాయం కాదన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నారు.
సిట్ దర్యాప్తుకు సహకరిస్తారా లేదా అనేది బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఇది కుల సమస్య కాదు, అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ బీసీలే. ఇది శాంతి భద్రతల సమస్య అన్నారు. బీఆర్ఎస్ పార్టీనే బాధితురాలి కోసం నిజాయితీగా పోరాడుతున్నదని స్పష్టం చేశారు.