హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని తెలిపారు. మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి, పొన్నం, సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు.
హైదరాబాద్, మే 16 (నమస్తేతెలంగాణ): పంట తెగుళ్లను గుర్తించి పురుగు మందులు చల్లే సెమీ ఆటోమెటిక్ ట్రాక్ట్ మొబైల్ మానిప్యులేటర్ రోబోను ఐఐటీ ఖరగ్‌పూర్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అభివృద్ధి చేసింది. ప్రొఫెసర్ దిలీప్‌కుమార్ ప్రతిహార్ నేతృత్వంలో విద్యార్థుల బృందం ఈ రోబోను తయారు చేసింది. కెమెరా ఆధారిత ఇమేజ్ అనాలిసిస్ ద్వారా తెగుళ్లను గుర్తిస్తుంది. తగిన ఎరువును ఎంచుకొని చల్లుతుంది.