ఉట్నూర్, మే 19 : బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్‌పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. 2023లో ఉట్నూర్ నుంచి ఖానాపూర్‌కు వెళ్తున్న క్రమంలో కొత్తగూడ చెక్‌పోస్ట్ వద్ద కాంగ్రెస్ నాయకులు జాన్సన్‌నాయక్‌ను అడ్డగించే ప్రయత్నం చేసి హంగామా సృష్టించారని గుర్తుచేశారు.
అప్పటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కేసు నమోదు చేయించగా సోమవారం పోలీసులు నోటీసులు అందించారని తెలిపారు. తాము కేసులకు భయపడేదిలేదని చెప్పారు. అధికార పార్టీ కావాలనే జాన్సన్ నాయక్‌పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.