బయ్యారం, జనవరి 4 : బయ్యారం సహకార పరపతి సంఘంలో రైతులకు శనివారం నేరుగా ఆధార్, ఫోన్ నంబర్లను నమోదు చేసి యూరియా పంపిణీ చేశారు. ఈ-పాస్ మెషిన్ ద్వారా ఆన్లైన్లో రైతుల వివరాలు నమోదు చేసి యూరియా పంపి ణీ చేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. సర్వర్ సమస్యలు తలెత్తడంతో మండలంలోని పలు గ్రామాల నుంచి యూరియా కోసం వచ్చిన రైతులు వెనుదిరగాల్సి వచ్చిం ది. దీంతో ‘యూరియా కోసం రైతుల ఇక్క ట్లు’ అనే శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో శనివారం కథనం ప్రచురితమైంది.
స్పందించిన సొసైటీ చైర్మన్ మధుకర్‌రెడ్డి ఆశాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించా రు. రైతుల ఆధార్, ఫోన్ నంబర్లు నమోదు చేసి యూరియా అందజేశారు. అనంతరం ఓటీపీ ద్వారా ఆన్లైన్ చేస్తామని చెప్పారు. ఉప్పలపాడు, గంథంపల్లి, కంబాలపల్లి సబ్‌సెంటర్ల ద్వారా కూడా యూరియా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.