కోదాడ, ఫిబ్రవరి 20 : కోదాడ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, తెలంగాణ సాహితీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పుప్పాల కృష్ణమూర్తికి భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్, ప్రజ్ఞాపూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కథానికల పోటీలో తన కథానిక ‘కన్నీటి వెన్నెల’కు తృతీయ పురస్కారం లభించింది. ఈ మేరకు హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో గురువారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఎం.ఎల్.కాంతారావు, సాహిత్య అకాడమీ తెలుగు మండలి కన్వీనర్ మృణాళిని, ఆంధ్రజ్యోతి పత్రిక పూర్వ సంపాదకులు కె. శ్రీనివాస్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రూ.6 వేల నగదు, శాలువా, మేమెంటో, ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకుడు నర్సింగరావు, రచయిత ఖదీర్ బాబుతో పాటు కవులు, రచయితలు హాజరయ్యారు.