నర్సాపూర్, ఆగస్ట్ 26 : యూరియా కృత్రిమ కొరతకు కాంగ్రెస్ సర్కారే కారణమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. యూరియా కొరతను నిరసిస్తూ మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో రైతులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. సునీతాలక్ష్మారెడ్డి అక్కడికి చేరుకుని రైతులకు సంఘీభావంగా ధర్నాలో పాల్గొన్నారు. గంట సేపు రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ సిబ్బందితో అక్కడికి వచ్చి సునీతాలక్ష్మారెడ్డిని, బీఆర్ఎస్ నాయకులను, రైతులను అరెస్ట్ చేశారు.