హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతా ల్లో ఇందిరమ్మ ఇ ండ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిందని, ఇక పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు నిర్మిస్తామని గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష తర్వాత మంత్రి మాట్లాడుతూ పట్టణాల్లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు అకడే ఉండటానికి ఇష్టపడుతున్నారని, నగరానికి దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే ఇండ్లు తీసుకోవడానికి ఆసక్తి చూపడంలేదని తెలిపారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్ తదితర నగరాల్లో జీ+3 పద్ధతిలో ఇండ్లను నిర్మిస్తామని చెప్పారు.