హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఈ నెల 16న రైతులు, కార్మిక సంఘాలు నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీఎస్సీ) తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి, శుక్రవారం ఆఫీసులకు నల్లబ్యాడ్జీలతో విధులకు వస్తామని వెల్లడించింది.
కేంద్రం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతులకు కనీస మద్ధతు ధర చట్టం చేయాలని కమిటీ నేతలు డిమాండ్ చేశారు.