హైదరాబాద్ : నగరంలోని ఉప్పల్ ఎమ్మెల్యే(Uppal Mla) భేతి సుభాష్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. బుధవారం కీసర రింగ్ రోడ్డు (Ring road) నుంచి ఉప్పల్ వైపు వస్తుండగా కుక్కలు అడ్డు రావడంతో ముందు వెళ్తున్న వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు వెనకాల నుంచి వచ్చి ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తో పాటు మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. తాను సురక్షితంగా ఉన్నానని, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే కోరారు.