ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం అకాల వర్షం కురిసింది. పలు మండలాల్లో పంటలు ధ్వంసమవగా.. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది.
నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్, నందిపేట, కోటగిరి, రెంజల్, రుద్రూర్, మోస్రా, చందూర్, ఎడపల్లి మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షాలతో చేతికొచ్చిన వరి, జొన్న పంటలు దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లిందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
-నిజామాబాద్