మెదక్: జిల్లాలోని నిజాంపేట్ మండలం చల్మెడ గ్రామంలో దారుణం చోటుచేసుకున్నది. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో శాల సుదర్శన్ అనే వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే సకాలంలో స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రమాదం తప్పింది. అప్పటికే మంటలు అంటుకోవడంతో బాధితుడికి గాయాలయ్యాయి. దీంతో ఆయనను రామాయంపెట్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సుదర్శన్‌కు నిప్పంటించిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.