హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూ డాటాబేస్‌లో తప్పులు జరుగుతున్నాయని, ఈ విషయంలో కొందరి అధికారుల పాత్ర ఉందని ఆ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘాల నాయకులు దిలీప్, రాహుల్ ఆరోపించారు. విద్యార్థులకు చెందిన డాటాబేస్‌లో సవరణలు జరుగుతున్నట్టు అనుమానం వ్యక్తంచేశారు.
ఆ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు తమ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్లు పొందే క్రమంలో.. ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని, అక్రమ పద్ధతుల్లో వారికి మార్కులు జోడిస్తున్నారని ఆరోపించారు.