e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home తెలంగాణ వర్సిటీలు ఆవిష్కరణల వేదికలవ్వాలి

వర్సిటీలు ఆవిష్కరణల వేదికలవ్వాలి

వర్సిటీలు ఆవిష్కరణల వేదికలవ్వాలి
  • కేవలం టీచింగ్‌ వర్సిటీలుగా మిగలవద్దు
  • వీసీలతో వీడియోకాన్ఫరెన్స్‌లో గవర్నర్‌

హైదరాబాద్‌, జూన్‌ 9 (నమస్తే తెలంగాణ): విశ్వవిద్యాలయాలు కేవలం టీచింగ్‌ వర్సిటీలుగా మిగులకూడదని, పరిశోధన, ఆవిష్కరణలకు నిలయాలుగా ఎదగాలని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ వైస్‌చాన్స్‌లర్లకు సూచించారు. రాష్ట్రంలోని 14 వర్సిటీల వీసీలతో గవర్నర్‌ బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం, ఆన్‌లైన్‌క్లాసులు, పరీక్షలు, చాన్స్‌లర్‌ కనెక్ట్‌లో పూర్వవిద్యార్థుల నమోదు అంశాలపై వీసీలతో చర్చించారు. ట్విట్టర్‌ వేదికగా ‘ఆస్క్‌ చాన్స్‌లర్‌’లో పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు గవర్నర్‌ సమాధానాలిచ్చారు. కొవిడ్‌ సంక్షోభ సమయంలో ప్రభుత్వ వైద్యులు అందిస్తున్న సేవలు, కొవిడ్‌పై చేస్తున్న పరిశోధనలను గవర్నర్‌ డాక్టర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ అభినందించారు. విపత్కర సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు సెల్యూట్‌ చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి, వైస్‌చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, గవర్నర్‌ కార్యదర్శి సురేంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వర్సిటీలు ఆవిష్కరణల వేదికలవ్వాలి

ట్రెండింగ్‌

Advertisement