న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ తదితర కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో 84,866 ఖాళీలు ఉన్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు.
సాయుధ బలగాల పూర్తి సామర్థ్యం 10,05,520 మంది అని చెప్పారు. గత 5 నెలల్లో 31,785 ఖాళీలను భర్తీ చేసినట్టు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 1 వరకు సాయుధ బలగాల్లో 2,345 వైద్యులు, నర్సులు ఇతర వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.