హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగా ణ): రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశా రు. తెలంగాణలో సొంతిల్లు అవసరం ఉన్న పేద కుటుంబాల జాబితాను త్వరగా రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందించాలని సూ చించారు. సీఎం రేవంత్‌రెడ్డికి మంగళవారం ఆయన లేఖ రాశారు.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల పనితీరును నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్స్ స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. నిరుడి కంటే ఈసారి జాతీయ స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంకింగ్ తగ్గి 70వ ర్యాంకుతోనే సరిపెట్టుకున్నదని తెలిపారు. కళాశాలల విభాగంలోనూ టాప్ 100లో తెలంగాణ నుంచి ఒక కాలేజీకీ స్థానం దకలేదని తెలిపారు. యూనివర్సిటీల్లో 2,400 ఖాళీలు వెకిరిస్తున్నాయని, నిధులు సిబ్బంది వేతనాలకే సరిపోతున్నాయని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు నిధులు అందడం లేదని విమర్శించారు.
సెప్టెంబర్ రెండో వారంలోగా ట్రిపుల్ ఆర్ భూసేకరణ ;కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు అవసరమైన భూములను సేకరించే ప్రక్రియ ను సెప్టెంబర్ రెండో వారంలోగా పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. భూసేకరణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని స్పష్టంచేశారు. సచివాలయంలో మంగళవారం ట్రిపుల్ ఆర్‌పై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆమె మాట్లాడు తూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ ఆర్ ప్రా జెక్టుకు సంబంధించి పెండింగులో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరా రు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇం దుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటుచేసి భూముల మా రెట్ విలువ ఆధారంగా పరిహారం అం దేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కోర్టు కేసులపై కూడా చొరవ తీసుకుని త్వరితగతిన పరిషారమయ్యేలా చర్య లు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి వికాస్‌రాజ్, ప్రభుత్వ సలహాదారులు శ్రీనివాస్‌రాజు, రెవిన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, అటవీశాఖ అడిషనల్ సెక్రటరీ ప్రశాంతి, ఆర్అండ్బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, సంయుక్త కార్యదర్శి హరీశ్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి, సిద్దిపేట కలెక్టర్లు సమీక్షలో పాల్లొన్నారు.