Kishan Reddy | హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నిరంకుశ, అప్రజాస్వామిక విధానాలతో రాష్ట్రం రావణకాష్టంలా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర విసృ్తత కార్యవర్గ సమావేశం శంషాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్-బీజేపీ ఒకటేనని చేసిన తప్పుడు ప్రచారం, గారడీ గ్యారంటీల వల్ల కాంగ్రెస్ గెలిచిందని ఎద్దేవా చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం ఉన్నదంటున్న రాహుల్ గాంధీ, దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీలో తిరగాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అతి తకువ కాలంలో నిరుద్యోగ యువత విశ్వాసం కోల్పోయిందని చెప్పా రు. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి 15 అం శాలతో కూడిన రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టారు. ముఖ్యఅతిథిగా కేంద్ర మం త్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. 8 మం ది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, రాష్ట్రస్థాయి నేతలు హాజరయ్యారు.
శుక్రవారం అసెంబ్లీ ఎల్పీ కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం జరిగింది. కొన్ని నెలలుగా అలకలో ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ సమావేశానికి బుల్లెట్‌పై రావడం అందరిలోనూ ఆసక్తి కలిగించింది.