హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగాన్ని కాలరాసి కాంగ్రెస్ నేతలు ఎమర్జెన్సీ తీసుకొచ్చార ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ దేశంలో ఎమర్జెన్సీ విధించి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను హరించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉండాలనే దుర్బుద్ధితో ప్రజాస్వామిక హక్కులను కాలరాయాలని కుట్ర చేసినా రాజ్యాంగం చెక్కు చెదరలేదంటే అది అంబేద్క్ర్ గొప్పతనం అని కొనియాడారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతారని, కానీ ఆయన అందులోని ఒక్క పేజీని చదివిన దాఖలాలు లేవని విమర్శించారు.