హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఎన్నికలకు ముందు ఎలాంటి ప్రణాళిక లేకుండా ఆరు గ్యారెంటీలను ప్రటించిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే లక్షన్నర కోట్ల అప్పు చేసిందని దుయ్యబట్టారు. ఈ అప్పులతో ప్రజలకు ఒరిగిందేమిటి? రాష్ట్రంలో వచ్చిన మార్పు ఏమిటి? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకునేందుకే తమిళనాడు సీఎం స్టాలిన్ రెండునెలలుగా వితండవాదం చేస్తున్నాడని విమర్శించారు.