హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాం గ్రెస్ ఏడాది పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిసెంబర్ 1 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్ర త్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. బుధవారం ఆ యన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు, డిక్లరేషన్లు, గ్యారెంటీలు, సబ్ గ్యారెంటీలను పక్కనపడేసిందని మండిపడ్డా రు. తాము సమస్యల మీద మాట్లాడి తే సీఎం వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తనది బీజేపీ డీఎన్ఏ అని, రేవంత్రెడ్డిలాగా పది పార్టీలు తిరిగిన డీఎన్ఏ కాదని విమర్శించారు. రుణమాఫీ, పింఛన్ల పెంపు, వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, ఏడాదిలోగా 420 సబ్ గ్యారెంటీలు అమలు చేశారా? అని ప్రశ్నించారు. అయినా కాంగ్రెస్ ఏడా ది పాలనపై ప్రభుత్వం వారం రోజు లు విజయోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఏడాదిలో బెదిరింపులు, తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు, అక్రమ కేసులు, గాలి మాటలు తప్ప సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. 11 నెలల్లోనే 11 ఏం డ్లకు సరిపడా ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకున్నదని ఇప్పటికైనా విపక్షాలను తిట్టడం మీద పెట్టే దృష్టి పాల న మీద పెడితే తెలంగాణ బాగుంటుందని సీఎంకు సూచించారు.