Kishan Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారానికోసారి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నియోజకవర్గ పునర్విభజనపై కేంద్రం ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఒక్క చప్రాసీ నౌకరీ కూడా రాదని వ్యాఖ్యానించడంపై ఆయన స్పందించారు.
డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ర్టాలకు సీట్లు భారీగా తగ్గుతాయనే ప్రచారంలో వాస్తవం లేదని, తాము దక్షిణాదిలోనే ఉన్నామని అన్యాయం జరుగనివ్వమని స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి అవగాహన లేదని ఎద్దేవా చేసిన కిషన్‌రెడ్డి, డీలిమిటేషన్ కాకుండా మహిళా రిజర్వేషన్లు చేయలేమని స్పష్టంచేశారు. డీలిమిటేషన్‌పై ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.