హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి మాయలోడు అని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో శనివారం నిర్వహించిన బీజేపీ బహిరంగసభలో నడ్డా మాట్లాడారు. పేదలను మభ్యపెట్టి హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మూడు రాష్ర్టాల్లోనూ హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిగా చూడటంలేదని అన్నారు. అర్బన్ నక్సల్స్ చేతిలో రేవంత్ సర్కార్ బందీగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్‌కు సంక్రాంతి వరకే డెడ్ లైన్ అని… అప్పటిలోగా ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే గ్రామాల్లో తిరగనీయమని హెచ్చరించారు. రాష్ట్రంలో అహంకార, అవినీతి పాలన కొనసాగుతున్నదని మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.