హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మంత్రులు, నాయకులు కమీషన్లు తీసుకుంటున్నారని, ఎంత బిల్లుకు ఎంత పర్సంటేజీ తీసుకుంటున్నారో ఆధారాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన నల్లకుంటలో శంకర్మఠ్ను సందర్శించిన అనంతరం మీడియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్లకు అలవాటు పడిందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు కమీషన్లు పంచుకోవడంలో కొట్లాడుకుంటారని మండిపడ్డారు.
అయితే, కాంగ్రెస్ నాయకుల కమీషన్లపై ఆధారాలు ఉంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నెటిజన్లు బండి సంజయ్‌ను ప్రశ్నిస్తున్నారు. ‘అవినీతి జరుగుతుంటే ఈడీ, సీబీఐతో విచారణ ఎందుకు చేయించడంలేదు? ఆధారాలున్నా చర్యలు తీసుకోవడం లేదంటే మీకు ఎంత కమీషన్ ముడుతున్నది? అని నిలదీస్తున్నారు.