Telangana | హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): అశోక్‌నగర్ వేదికగా కాంగ్రెస్, బీజేపీ తొండాట బయటపడింది. బీజేపీ లాభపడ్డా పర్వాలేదు కానీ బీఆర్ఎస్కు మాత్రం క్రెడిట్ దక్కొద్దనే కాంగ్రెస్ వ్యూహం బట్టబయలైంది. గ్రూప్-1 అభ్యర్థులకు అండగా ఉంటున్న బీఆర్ఎస్కు ఎక్కడ పేరొస్తుందో అనే ఆందోళనతో బీజేపీ, కాంగ్రెస్ శనివారం హైడ్రామాకు తెరలేపాయి. గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ ముందునుం చీ అండగా ఉంటున్నది. అభ్యర్థులకు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బలంగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తమకు నిజాయితీతో అండగా ఉంటున్న విషయాన్ని గ్రూప్-1 అభ్యర్థులు సైతం గుర్తించారు.
గతంలోని పరిణామాలకు క్షమాపణ చెప్పడంతో పాటు అశోక్‌నగర్‌కు రావాలని సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌ను కోరారు. కేటీఆర్ ఆహ్వానం మేరకు తెలంగాణ భవన్‌కు వెళ్లి చర్చించారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి సాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సుప్రీంకోర్టులో అభ్యర్థులకు బీఆర్ఎస్ న్యాయ సాయాన్ని అందిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మద్దతు గ్రూప్-1 అభ్యర్థుల్లో ధైర్యాన్ని నింపింది. శనివారం కూడా సిద్దిపేట నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. జీవో 29 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో అసెంబ్లీలోనూ ఈ అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇంతకాలం గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై మౌనంగా ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ శనివారం ఉన్నపళంగా రంగంలోకి దిగారు. అశోక్‌నగర్‌కు వెళ్లి అభ్యర్థులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. షెడ్యూల్లో లేకపోయినా సచివాలయానికి ర్యాలీ ప్రారంభించారు. అయితే, బండి సంజయ్ అశోక్‌నగర్‌లో ఆందోళనకు దిగడం వెనుక కాంగ్రెస్ – బీజేపీ ఉమ్మడి వ్యూహం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలో క్రెడిట్ ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందో అనే భయంతో బండి సంజయ్ ఇంతలా స్పందించారనే ప్రచారం జరుగుతున్నది. బండి సంజయ్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పరోక్షంగా సహకరించినట్టు శనివారం నాటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో అశోక్‌నగర్‌ను నిషేధిత ప్రాంతం తరహాలో ప్రభుత్వం మార్చేసింది. బీఆర్ఎస్ నేతలు వెళితే అరెస్టు చేయించింది. విద్యార్థులపై పలుమార్లు లాఠీచార్జి జరిపించింది. కానీ, బండి సంజయ్‌కు మాత్రం ప్రభుత్వం సహకరించినట్టు కనిపిస్తున్నది.
బీఆర్ఎస్ నేతలు అశోక్‌నగర్‌కు వెళ్లకుండా అ డ్డుకుంటున్న పోలీసులు.. అశోక్‌నగర్‌కు వెళ్తానని ఒక రోజు ముందే ప్రకటించినప్పటికీ బండి సంజయ్‌ను మాత్రం నియంత్రించే ప్రయత్నం చేయలేదు. సచివాలయం దరిదాపుల్లోకి కూడా ఏ నిరసనకారులను అనుమతించని పోలీసులు.. బండి సంజయ్‌ను మాత్రం అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లేవరకు అడ్డుకోలేదు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసిన పోలీసులు సంజయ్ ను మాత్రం తీసుకెళ్లి పార్టీ ఆఫీసులో వదిలిపెట్టా రు. తద్వారా బండి సంజయ్‌కు క్రెడిట్ దక్కేలా ప్రభుత్వం పరోక్షంగా సహకరించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
‘నన్ను కారులోకి గుంజండి’ అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇదంతా క్రెడిట్ కోసమేనా?, దీని వెనుక కాంగ్రెస్ పరోక్ష మద్దతు ఉందా? అనే అ నుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా, మూ సీ కూల్చివేతలపై ప్రజలు గొంతెత్తుతున్నా బండి సంజయ్ స్పందించలేదు. రేవంత్‌రెడ్డిని సీఎం పదవి పదవిలో కొనసాగాలని శుక్రవారం ఆయన ఆకాంక్షించారు. కాంగ్రెస్ నేతలే రేవంత్‌ను పదవి నుంచి దించేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కృతజ్ఞతగానే గ్రూప్-1 ఆందోళనలో సంజయ్‌కు క్రెడిట్ దక్కేలా ప్రభు త్వ పెద్దలు సహకరించారా? ఇవి కాంగ్రెస్ – బీ జేపీ మిలాఖత్ రాజకీయాలను సూచిస్తున్నాయని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.