Amit Shah Road show utter flop | అమిత్‌షా రోడ్డుషో వెలవెల..కేటీఆర్ రోడ్‌షో కలకల
Amit Shah | పెద్దపల్లి(Peddapalli) బీజేపీ అభ్యర్థి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit Shah) సకల జనుల విజయ సంకల్ప రోడ్డుషో(Road show) పెద్దపల్లిలో అట్టర్ ఫ్లాప్ అయింది. 10 గంటల వరకు జనసమీకరణకు ప్లాన్ చేసిన బీజేపీ నాయకులు అనుకున్నదొక్కటి.. అయిందొకటి అయ్యింది. వాళ్ల అంచనాల దరిదాపుల్లోకి కాదుక కదా.. కనీసం సగానికి సగం సైతం ప్రజలు రాలేదు.
పెద్దపల్లి, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి(Peddapalli) బీజేపీ అభ్యర్థి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit Shah) సకల జనుల విజయ సంకల్ప రోడ్డుషో(Road show) పెద్దపల్లిలో అట్టర్ ఫ్లాప్ అయింది. 10 గంటల వరకు జనసమీకరణకు ప్లాన్ చేసిన బీజేపీ నాయకులు అనుకున్నదొక్కటి.. అయిందొకటి అయ్యింది. వాళ్ల అంచనాల దరిదాపుల్లోకి కాదుక కదా.. కనీసం సగానికి సగం సైతం ప్రజలు రాలేదు. కేవలం 3వేల మంది వరకు మాత్రమే హాజరు కావడంతో చావు తప్పి కన్నులొట్ట పోయిన చందంగా తయారయింది.
దీనికి తోడు కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్‌షా హాజరు కాగా ఆయన ఎక్కిన ప్రచార రథం మొరాయించడం బీజేపీ శ్రేణులను మరింత కుంగదీసింది. పెద్దపల్లి కమాన్ వద్దకు చేరుకున్న అమిత్‌షాకు అభ్యర్థి ప్రదీప్‌కుమార్‌తో పాటుగా ఆ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఆ తర్వాత కమాన్ వద్ద ఏర్పాటు చేసిన బీజేపీ ప్రచార రథంపైకి అమిత్‌షా ఎక్కగా.. కొద్ది దూరం పాటు వెళ్లిన తర్వాత వాహనం నిలిచిపోయింది. దీంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నెట్టినప్పటికీ అది స్టార్ట్ కాలేదు. దీంతో మరో వాహనంలో అమిత్‌షా జెండా చౌరస్తాకు చేరుకున్నారు.

కేటీఆర్ రోడ్ షోకు భారీగా తరలి వచ్చిన జనం..
అక్కడ రోడ్డుషో 5నిమిషాల పాటు చప్పగా సాగింది. కాగా, నియోజకవర్గంలోని సుల్తానాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హాజరు కాగా ఆ రోడ్డు షోకు దాదాపుగా 10వేలకు పై తరలివచ్చారు. జిల్లా కేంద్రంలో బీజేపీ అభ్యర్థి ప్రదీప్‌కుమార్‌కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హాజరు కాగా నియోజకవర్గ కేంద్రంలో జనం లేకపోవడంతో రోడ్‌షో వెలవెల బోయింది.
దీనికి తోడు అమిత్‌షా పర్యటనకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ నాయకుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, మరో జాతీయ నాయకుడు మీస అర్జున్‌రావుతో పాటు మరికొంత మందికి దూరంగా ఉన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో పెట్టక పెట్టక ఒక్క రోడ్డు షో పెడితే అది అట్టర్ ఫ్లాఫ్ కావడంతో అభ్యర్థితో పాటుగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిగా నిస్తేజంలోకి వెళ్లిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Amit Shah
- KTR
- Pedpadalli
- Road show
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

