హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని ఉద్యోగ సంఘాల నేతలు కొనియాడారు. కాంట్రాక్టు లెక్చరర్లను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడాన్ని పురస్కరించుకొని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో టిప్స్, టిగ్లా, జేసీఎల్ఏ-475, టీజీవో ఇంటర్ ఫోరం నేతలు గురువారం మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో టిప్స్ కన్వీనర్ రామకృష్ణగౌడ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.