హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): బీడీ, సినీ, భూగర్భ గనుల పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను చదువుల్లో ప్రోత్సహించేందుకు ఉపకార వేతనాలకు దరఖాస్తులను ఆహ్వానించినట్టు కేంద్ర కార్మిక-ఉపాధికల్పన మంత్రిత్వశాఖ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికులు అధికంగా ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపింది.
ఒకటి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు https// scho lars hip. gov.in వెబ్సైట్లో ఆగస్టు 31వరకు, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ విద్యార్థులు అక్టోబర్ 31వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. స్కాలర్షిప్ పొందే విద్యార్థుల తల్లిదండ్రులకు పీఎఫ్ ఐడీకార్డు ఉండాలని పేర్కొన్నది. విద్యార్థికి బ్యాంకు అకౌంట్‌తోపాటు, ఉత్తీర్ణత శాతం, కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.1.20లక్షలలోపు ఉండాలని తెలిపింది. సప్లిమెంటరీ పరీక్షల్లో పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులేనని వివరించింది. వివరాలకు 040-25561297 నంబర్ సంప్రదించాలని వెల్లడించింది.