హైదరాబాద్: తెలంగాణకు (Telangana) కేంద్ర ప్రభుత్వ అవార్డుల పరంపర కొనసాగుతున్నది. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు ఇప్పటికే పలు జాతీయ అవార్డులు అందుకోగా తాజాగా కేంద్ర జలశక్తి శాఖ (Jal shakti ministry) ప్రకటించిన నాలుగో జాతీయ జల అవార్డుల్లో (National water awards) రాష్ట్రానికి మూడు పురస్కారాలు లభించాయి. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని జగన్నాథపురం (Jagannadhapuram) గ్రామ పంచాయతీకి జాతీయ ఉత్తమ పురస్కారం లభించగా, ఉత్తమ జిల్లా కేటగిరీలో ఆదిలాబాద్‌కు మూడో స్థానం, ఉత్తమ సంస్థల విభాగంలో ఉర్దూ వర్సిటీకి రెండో స్థానంలో నిలిచాయి. ఈనెల 17న ఢిల్లీలో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జరుగనుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహిస్తున్న రోజునే ఈ అవార్డు లభించడం విశేషం.