Telangana | హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది జూన్ 15 నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్లో జరగనున్న G 20 అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ముందస్తు ఏర్పాట్లపై మనోజ్ అహుజా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, పెద్ద ఎత్తున పెరిగిన వ్యవసాయోత్పత్తుల వివరాలను మనోజ్ అహుజాకు సీఎస్ శాంతికుమారి అందించి, వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు కూడా ఉన్నారు.