హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : నోటిఫికేషన్ల విడుదలలో కాంగ్రెస్ సర్కార్ ప్రదర్శిస్తున్న అలసత్వంతో జీవితాలు నాశనం అవుతున్నాయని, ఏండ్లకు ఏండ్లుగా నోటిఫికేషన్లు లేకపోవడంతో వయస్సు పెరిగిపోతోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఈ క్రమంలో త్వరలో పోలీస్ ఉద్యోగాలకు ఇచ్చే నోటిఫికేషన్లో ఎస్సై ఉద్యోగార్థుల వయస్సు 38 ఏండ్లకు, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల వయస్సు 36 ఏండ్లకు పెంచాలని అమరజ్యోతి వద్ద నిరసన తెలిపారు.