హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి రోజురోజుకు అసంతృప్తి పెరుగుతున్నది. తాజాగా గాంధీ భవన్(Gandhi Bhavan) వద్ద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అభ్యర్థులు(AEE Candidates) ఆందోళన(Protest) చేపట్టారు. ‘హాలో నిరుద్యోగి-చలో గాంధీ భవన్’ పేరిట చేపట్టిన ఆందోళనలో అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏఈఈ పరీక్ష ఫలితాలను ప్రకటించి పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో అభ్యర్థులు ఆందోళన విరమించారు.