చిక్కడపల్లి, జూన్19 : కాంగ్రెస్ అగ్రనేత రాహల్‌గాంధీ జన్మదినం పురస్కరించుకుని చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరుద్యోగులు బ్లాక్ టీషర్టులు ధరించి కేక్ కట్ చేసి.. ఇచ్చిన హా మీలు ఏమయ్యాయని రాహల్, రేవంత్రెడిని ప్రశ్నించారు. ఈ సందర్భగా నిరుద్యోగులు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రాహుల్‌గాంధీ చిక్కడపల్లి లైబ్రరీని సందర్శించి నిరుద్యోగులకు అండగా ఉంటామని, అధికారం చేపట్టగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ నిరుద్యోగుల సమస్యలు గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుచేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్‌గాంధీ చెప్పే ‘మొహబ్బత్‌కీ దుకాణ్’ కాస్తా ‘మోసాల దుకాణ్’గా మా రిందని విమర్శించారు. ‘ఎన్నికల వాగ్దా నం మేరకు తక్షణమే 2క్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలి. మెగా డీఎస్సీ, గ్రూప్-1,2,3,4 ఖాళీలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. పోలీస్ ఉద్యోగాలు 20 వేలకు పెంచాలి. నిరుద్యోగులపై అక్ర మ కేసులు ఎత్తివేయాలి’ అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా.. ‘మా చాయ్ తాగినవు.. మమ్మల్ని ముంచినవు’, ‘వద్దురా నాయిన కాంగ్రెస్ పాలన’, ‘జై తెలంగాణ.. జై జై తెలంగాణ’, ‘నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి’, ‘ఖబడ్దార్ రాహుల్‌గాంధీ’ అంటూ పెద్దఎత్తున నినదించారు.