హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో భూగర్భ విద్యుత్తు ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ ఫైనల్ స్టేజీలో ఉన్నదని విద్యుత్తు శాఖకు చెందిన కీలక అధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో తొలుత పైలెట్ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. రూ.450 కోట్లు అవసరమని అంచనా వేసినట్టు వెల్లడించారు.అండర్‌గ్రౌండ్ కేబులింగ్‌కు కిలోమీటరుకు రూ.80 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉన్నదన్నారు.
హైదరాబాద్, జనవరి 6(నమస్తే తెలంగాణ) : తెలంగాణ శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన శాసనమండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత జీరో అవర్ నిర్వహించారు. అనంతరం తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ చట్టం-1991(కొత్తగూడలో ఎర్త్‌సైన్స్ విశ్వవిద్యాలయం) బిల్లు, జీఎస్టీ సవరణ, హిల్ట్, మున్సిపల్ సవరణ చట్టం బిల్లులపై చర్చ జరిగింది. అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేశారు. సమావేశాలు 5 రోజులపాటు దాదాపు 19:52 గంటలు జరిగినట్టు తెలిపారు. దాదాపు 33 స్టార్గుర్తు ప్రశ్నలు, 61 అనుబంధ ప్రశ్నలపై చర్చించినట్టు, చర్చలో 34 మంది సభ్యులు పాల్గొన్నట్టు చెప్పారు. 13 బిల్లులు ఆమోదం పొందాయని తెలిపారు.