అసెంబ్లీలో మీడియాపై ఆంక్షలు
అసెంబ్లీ ప్రాంగణంలో ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అప్రకటిత నిర్బంధాన్ని విధించింది. చట్టసభల చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో మీడియా ప్రతినిధుల కదలికలను ఒక మూలకు కట్టడి చేసింది. ప్రభుత్వం ఏరికోరి పెట్టుకున్న అసెంబ్లీ మీడియా కమిటీ సైతం ఈ నిర్ణయానికి వత్తాసు పలుకడం గమనార్హం. అసెంబ్లీ లాబీల్లోకి మీడియా ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతున్నది.
- లాబీల్లోకి రాకుండా నిషేధం
- మంత్రుల చాంబర్ల వైపు వెళ్లకుండా తలపులు
- జర్నలిస్టులు వస్తే తమకు అసౌకర్యమని స్పీకర్‌కు మంత్రుల మూకుమ్మడి ఫిర్యాదు
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ప్రాంగణంలో ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అప్రకటిత నిర్బంధాన్ని విధించింది. చట్టసభల చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో మీడియా ప్రతినిధుల కదలికలను ఒక మూలకు కట్టడి చేసింది. ప్రభుత్వం ఏరికోరి పెట్టుకున్న అసెంబ్లీ మీడియా కమిటీ సైతం ఈ నిర్ణయానికి వత్తాసు పలుకడం గమనార్హం. అసెంబ్లీ లాబీల్లోకి మీడియా ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతున్నది.
గతంలో మంత్రులు, శాసనసభ్యులతో ముచ్చటించేందుకు, పరిణామాలను విశ్లేషించేందుకు అందుబాటులో ఉన్న లాబీలను పాత్రికేయులకు దూరం చేశారు. అసెంబ్లీ సెక్రటరీ తిరుపతి మీడియా కోసం తాతాలికంగా ఏర్పాటుచేసిన లాంజ్‌లోకి స్వయంగా వచ్చి, ఇకపై మీడియాకు లాంజ్ల్లో అనుమతి లేదని ప్రకటించారు. అసెంబ్లీ లాబీల్లోకి జర్నలిస్టులు రావడం వల్ల తాము తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని, అధికారులతో స్వేచ్ఛగా ఇంటరాక్ట్ కాలేకపోతున్నామని మంత్రులంతా ఏకగ్రీవంగా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని ఆయన వెల్లడించారు. ఆ ఫిర్యాదుల నేపథ్యంలో స్పీకర్ ఇచ్చిన ఆదేశాల మేరకే జర్నలిస్టులను లాబీలు, లాంజ్ల్లోకి అనుమతించడం లేదని అసెంబ్లీ సెక్రటరీ స్పష్టంచేయడం గమనార్హం.
ప్రతిపక్ష నేత లాంజ్‌కే మీడియా పరిమితం
మంత్రుల చాంబర్ల వైపు పాత్రికేయులు కన్నెత్తి చూడకుండా నిషేధం విధించిన అధికారులు, కేవలం ఎల్వోపీ (ప్రతిపక్ష నేత) వైపు ఉన్న లాంజ్‌కే మీడియాను పరిమితం చేశారు. అయితే, అకడ మీడియా ప్రతినిధులకు కనీస వసతులు కూడా కల్పించకపోవడం తీవ్ర నిరసనలకు దారితీసింది. దాహాన్ని తీర్చుకొనేందుకు గుకెడు మంచినీళ్లు లేకపోగా, కనీసం టాయిలెట్ల సౌకర్యం కూడా ఏర్పాటు చేయకపోవడంతో విధి నిర్వహణకు వచ్చిన జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతకు ప్రతీకగా ఉండాల్సిన శాసనసభలో మీడియా గొంతు నొకేలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వ లోపాలు, అసెంబ్లీ లోపల జరిగే అసలు వాస్తవాలు ప్రజలకు తెలియకుండా తొకిపెట్టేందుకే మంత్రు లు, అధికారులు కలిసి ఈ నిరంకుశ ఆంక్షలకు తెరలేపారనే ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కాగా దీనిపై అసెంబ్లీ మీడియా కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డిని జర్నలిస్టులు కలిసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ, ఆయన విచిత్రంగా ‘ఈమాత్రం కూడా లేకుండా చేసుకోవద్ద’ని మాట్లాడటంతో జర్నలిస్టులు విస్మయం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

