జగిత్యాల, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిషారానికి రాజీలేని పోరాటం చేస్తామని టీ ఉద్యోగ జేఏసీ, టీఎన్జీవోస్ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ స్పష్టంచేశారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలు, నగదురహిత వైద్య సేవలు, 317 జీవో రద్దు, సీపీఎస్ రద్దు, ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనల అమలు, పెన్షనర్లకు డైరెక్టరేట్ ఏర్పాటు వంటి 36 సమస్యల పరిషారానికి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమావేశంలో జేఏసీ కోశాధికారి షాహిద్ బాబు, సహ అధ్యక్షులు అమరేందర్‌రెడ్డి, టీ పెన్షనర్ల జిల్లా అధ్యక్షుడు హరిఅశోక్కుమార్, టీజీవో నాయకులు కందుకూరి రవిబాబు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
అల్లుడిని పిలిచి అంతమొందించాడు
జూలపల్లి, ఆగస్టు 18: మద్యం సేవిద్దామని ఇంటికి పిలిచిన మామ.. అల్లుడిని హతమార్చిన ఘటన పెద్దపల్లి జిల్లాలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. జూలపల్లి మండలం కాచాపూర్కి చెందిన జేజేల అశోక్ అలియాస్ చెత్తయ్య (45)కు అదే గ్రామానికి చెందిన జాడి కనక య్య 20 ఏండ్ల క్రితం కూతురిని ఇచ్చి వివాహం చేశాడు. అశోక్ వ్యవసా యం చేస్తున్నాడు. మామ, అల్లుడికి పదేండ్లుగా గొడవలు ఉన్నాయి.
అల్లుడికి తన భార్యతో వివాహేతర సం బంధం ఉన్నదన్న అనుమానంతో చంపేయాలని మామ భావించాడు. మద్యం తాగుదామని అశోక్‌ను ఆదివారం ఇంటికి పిలిచాడు. ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత ఇరువురి మధ్య వాగ్వాదం జరగగా.. కనకయ్య ఇనుప రాడ్, బండరాయి తో అశోక్ తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అశోక్‌కు భార్య అంజలి, నలుగురు కూతుర్లు ఉన్నారు.
రేపు నాందేడ్‌లో బీఆర్ఎస్ రాష్ట్రస్థాయి సమావేశం
ముంబై, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : త్వరలో మహారాష్ట్రలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సి న వ్యూహంపై చర్చించేందుకు మంగళవారం నాందేడ్‌లో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు రైతు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంకర్ అన్నా ధోంగే తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మహారాష్ట్రలో బీఆర్ఎస్ సమావేశం నిర్వహించలేదని పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసే అంశంపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.