ఎడపల్లి, అక్టోబర్ 17: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం నెహ్రునగర్ గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ కయ్యుం(45) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతకాలం క్రితం ఇల్లు నిర్మించుకునేందుకు ఓ ప్రైవేట్ ఫైనాన్స్‌లో రూ. 2లక్షలు లోన్ తీసుకున్నాడు. నాలుగు నెలల క్రితం పక్షవాతానికి గురైన క య్యుంకు లోన్ కిస్తీలు కట్టడంతోపా టు ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనై బుధవారం జాన్కంపేట్ సమీపంలోని అశోక్‌సాగర్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరోటౌన్ పోలీసులు గురువారం మృతదేహాన్ని బయటికి తీయించారు. మృతుడి భార్య గౌసి యా బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.