చొప్పదండి, నవంబర్ 16 : ఎస్సై వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఠాణాలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్లో శనివారం చోటుచేసుకున్నది. కుటుంబసభ్యుల కథనం ప్రకా రం.. చొప్పదండికి చెందిన కల్లెపల్లి ఆనం ద్, శారద దంపతులు. వారి ఇంటి పకనే వడ్లూరి లింగయ్య కుటుంబం నివాసం ఉం టుంది. లింగయ్యతోపాటు ఆయన కుటుం బసభ్యులు రామలక్ష్మి, గజ్జెల విమల, అం జయ్య, సీపెల్లి నిర్మల, గజ్జెల సబ్సీనా, గజ్జెల ఇండ్ర హర్షిత్ కలిసి రెండిండ్ల మధ్యలో హద్దురాళ్లు తీసేసి ఆనంద్ భూమిలోకి చొరబడ్డారు.
హద్దురాళ్లను పాతేందుకు ప్రయత్నించగా ఆనంద్ అడ్డుకున్నాడు. ఈ ఏడుగురు ఆనంద్ కుటుంబ సభ్యులతో గొడవ కు దిగి చంపుతామని బెదిరించారు. దీంతో ఆనంద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్సై అనూషకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును ఎస్సై అనూష, కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి తప్పుదోవ పట్టించారని ఆనంద్ భార్య శారద తెలిపింది. తమపై తప్పుడు కేసులు పెట్టారని వాపోయింది.
ఈ విషయమై సీపీ అభిషేక్ మొహంతికి కూడా ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. తమకు న్యాయం జరగడం లేద ని శనివారం ఆనంద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్ర యత్నించాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆనంద్ ఫిర్యాదు మేరకు లింగయ్య కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశానని, ఆనంద్‌ను ఇబ్బందులకు గురిచేయలేదని ఎస్సై అనూష తెలిపారు.