సిర్పూర్(టీ), డిసెంబర్ 15 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మం డలం ఇటుకలపాడులో ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వడాయి తానుబాయి గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థి ఓడిపోయింది. దీంతో ఆమె భర్త మొర్లె భీంరావు సోమవారం ఉదయం సర్పంచ్ ఇంటికి వెళ్లి ఆమె భర్త పోశెట్టిపై కత్తితో దాడి చేయబోగా, త్రుటిలో తప్పించుకున్నాడు.
గ్రామస్తులు భీంరావును పట్టుకొని తాడుతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సురేశ్‌కుమార్ తెలిపారు.