Group-4 | హైదరాబాద్ : గ్రూప్ -4 తుది ఫలితాల కోసం అభ్యర్థులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష జరిగి ఇప్పటికి 500 రోజులు పూర్తికావొస్తున్నా నియామకాలు పూర్తికాకపోవడంతో అభ్యర్థులు లేఖల (లెటర్ క్యాంపేయిన్) ద్వారా తమ నిరసన వ్యక్త పరిచారు. తుది ఫలితాలు విడుదల చేయాలని కోరినా ఫలితం లేకపోవడం, టీజీపీఎస్సీ అధికారులు తీవ్రంగా జాప్యం చేస్తుండటంతో శాంతియుత పద్ధతుల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సెలెక్షన్ లిస్టును విడుదల చేయాలని ఆయా లేఖ ద్వారా టీజీపీఎస్సీ అధికారులను కోరారు.
ఇవి కూడా చదవండి..
Health tips | మార్కెట్లో విరివిగా లభించే పుదీనా ఆ సమస్యలకు చక్కటి ఔషధం..!
Research | ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ టాయిలెట్ కుండీల కంటే అశుద్ధమట..!
Health Tips | ఊబకాయంతో విసిగిపోతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!