Health tips : ప్రకృతిలో సహజంగా లభ్యమయ్యే మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అంతేగాక ఆరోగ్యపరంగా ఒక్కో మొక్కకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అదేవిధంగా పుదీనాతో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తరచూ వంటల్లో పుదీనాను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ పుదీనాలో లెక్కలేనన్ని ఔషధ గుణాలున్నాయి. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ మూలకాలు, సీ, డీ, ఈ, బీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అనారోగ్యాన్ని దరిచేరనివ్వవు. ఆరోగ్యపరంగా పుదీనాతో ఎన్ని లాభాలున్నాయో ఇప్పుడు చూద్దాం..