హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): రష్యా- ఉక్రెయిన్ యు ద్ధంతో ఉక్రెయిన్‌లో వైద్య విద్యకు డిమాండ్ తగ్గిందని జీఎస్ఎల్ వైద్య విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ గోగినేని వెల్లడించారు. గతంలో ఏ టా పది వేల మంది ఎంబీబీఎస్ చదివేందుకు ఉక్రెయిన్‌కు వెళ్లగా ఇది అమాంతం తగ్గిందని పేర్కొన్నారు. ఉబ్జెకిస్తాన్లో ఎంబీబీఎస్ చదివేందుకు పుష్కలంగా అవకాశాలున్నాయని వెల్లడించారు.
ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ఉబ్జెకిస్తాన్‌లోని ఇంపల్స్ మెడికల్ ఇన్స్టిట్యూట్తో కలిసి మెడికల్ కోర్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. 54 నెలల వ్యవధి గల ఈ కోర్సులో 12 నెలలు పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉంటుందని పేర్కొన్నారు.
ఇంటర్న్‌షిప్ కాలం లో నెలకు రూ.100 -200 డాలర్ల ైైస్టెపెండ్ లభిస్తుందని తెలిపారు. ఇంప ల్స్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ప్రెసిడెం ట్ డాక్టర్ బఖ్తినూర్ ఒయ్బుటేవిచ్ కుదనోవ్ మాట్లాడుతూ.. తాష్కెంట్, నమన్గన్ ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో తమ విద్యాసంస్థలున్నాయని పేర్కొన్నారు. భారత వైద్య కళాశాలల కరిక్యులాన్ని పాటిస్తున్నామని తెలిపారు. దీనిద్వారా అనేక దేశాల్లో వై ద్య విద్యను ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని వెల్లడించారు.