BEd Colleges | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : బీఈడీ కాలేజీల్లోనూ బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీ కోర్సులు నిర్వహించుకోవచ్చని ఎన్సీటీఈ స్పష్టంచేసింది. ఒక విద్యాసంస్థ కనీసంగా రెండు కోర్సులు నిర్వహించవచ్చని వెల్లడించింది. మల్టీ డిసిప్లినరీ విధానంలో ఈ కోర్సులు నిర్వహించుకోవచ్చని సూచించింది. ఈ కోర్సుల నిర్వహణ కోసం కాలేజీలు, విద్యాసంస్థలను విలీనం చేసుకోవచ్చని ఎన్సీటీఈ ఇటీవల జారీచేసిన మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది.
ప్రస్తుతం బీఈడీ కాలేజీల్లో రెండేండ్ల బీఎడ్ కోర్సును మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇటీవలీ ఎన్సీటీఈ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంను అందుబాటులోకి తేగా రెండేండ్ల బీఈడీని ఒకే ఏడాది పూర్తిచేయడం ఈ కోర్సు ప్రత్యేకత.