హైదరాబాద్: ఉద్యోగ అవకాశాల కోసం థాయ్‌లాండ్ వెళ్లిన ఇద్దరు తెలంగాణ వాసులు అదృశ్యమైనట్లు తెలిసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావుపేట్కు చెందిన శనిగరపు అరవింద్, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని షెట్పల్లికి చెందిన కొండా సాగర్‌గా వారిని గుర్తించారు. జగిత్యాల జిల్లాకు చెందిన సమ్మెట రాజు అనే రిక్రూటింగ్ ఏజెంట్‌కు రూ. 2 లక్షలు చెల్లించి విజిటింగ్ వీసాపై వారిద్దరూ థాయ్‌లాండ్‌కు వెళ్లినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. నవంబర్ 11న బ్యాంకాక్ చేరుకున్న వారిద్దరూ ఆ తర్వాత ఆచూకీ లేకుండాపోయారని ఆరోపించారు. తమవారి ఆచూకీ కనుగొనేందుకు రాష్ట్రప్రభుత్వం, భారత ఎంబసీ సహకరించాలని కోరారు.