ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థులకు కరెంట్ షాక్
ఇప్పటికే పలు గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్‌పాయిజన్, పాము కాటులకు గురవుతుండగా.. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొల్లబుద్ధారం గ్రామంలోని ఎస్సీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు కరెంట్ షాక్‌కు గురయ్యారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం గురుకులాల్లో చదివే విద్యార్థుల పాలిట శాపంగా మారుతుంది. ఇప్పటికే పలు గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్‌పాయిజన్, పాము కాటులకు గురవుతుండగా.. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొల్లబుద్ధారం గ్రామంలోని ఎస్సీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు కరెంట్ షాక్‌కు గురయ్యారు.
గొల్లబుద్ధారం గ్రామంలోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ ప్రాంగణంలో ఇటీవల చెట్ల కొమ్మలు విపరీతంగా పెరిగాయి. పనివాళ్లతో వాటిని కొట్టించాల్సిన హాస్టల్ సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో ఆ చెట్ల కొమ్మలను కొట్టమని గురుకులంలో తొమ్మిదో తరగతి చదివే ఇద్దరు విద్యార్థులను వార్డెన్ ఆదేశించారు. వార్డెన్ చెప్పడంతో ఇద్దరు విద్యార్థులు కొమ్మలను నరికారు. ఈ క్రమంలో చెట్టు కొమ్మలు కరెంట్ వైర్‌కు తగిలి ఉండటంతో ఇద్దరు విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు.
కరెంట్ షాక్‌తో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులను వెంటనే భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్
ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు కరెంట్ షాక్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొల్ల బుద్దారం గ్రామంలోని ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు చెట్ల కొమ్మలు కొట్టమని చెప్పిన వార్డెన్
చెట్టు కొమ్మలు కొడుతుండగా కరెంట్ షాక్‌కు గురైన ఇద్దరు విద్యార్థులు
తీవ్ర గాయాలపాలైన… pic.twitter.com/g1gXp1x9qB
— Telugu Scribe (@TeluguScribe) September 13, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

