గజ్వేల్, మార్చి 29: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్లకు చెందిన ఇద్దరు విద్యార్థులు కాలువలో పడి మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కుక్కల రిషిత(13 ) ఎనిమిదో తరగతి, కుక్కల మనీశ్ (12) ఏడో తరగతి చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇంటిపక్కనే ఉన్న పొలానికి వెళ్లారు.
తిరిగి వస్తున్న క్రమంలో పక్కనే ఉన్న మల్లన్నసాగర్ కాలువలో జారిపడ్డారు. గమనించిన గ్రామస్తులు రక్షించే ప్రయత్నంచేయగా అప్పటికే విగతజీవులయ్యారు.