ఆదిలాబాద్ : మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident )చోటు చోసుకుంది. పాండ్రకోడ వద్ద ఆదివారం రాత్రి 12:30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రిమ్స్ వైద్య కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు( RIMS students )బాలసాయి విజయవాడ, డేవిడ్ రాజ్ వరంల్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో విద్యార్థికి గాయాలు అయ్యాయి. చికిత్స కోసం అతన్నిదవాఖానకు తరలించారు.
కాగా, ఆరుగురు విద్యార్థులు రెండు మోటర్ సైకిళ్లపై మహారాష్ట్ర వెళ్లి వస్తుండగా పాండ్రకోడ వద్ద ఆగి ఉన్న లారీలను ఢీ కొట్టారు. దీంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మహారాష్ట్ర పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల మృతితో రిమ్స్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. రిమ్స్ ప్రొఫెసర్లు, విద్యార్థులు ప్రమాదం జరిగిన ప్రదేశం తరలివెళ్లారు.