హైదరాబాద్ : హై కోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు-పీవీ నాగమణిల హత్య కేసులో ఏ-1, ఏ -2 నిందితులకు బెయిలు మంజూరు అయింది. ఈ మేరకు గురువారం పెద్దపల్లి జిల్లా కోర్టులో నిందితుల తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ష్యూరిటీస్ సబ్మిట్ చేసిన అనంతరం ఇద్దరు నిందితులు కూడా జైలు నుంచి బయటకు రానున్నారు. ఈ కేసులో ఏ1గా కుంట శ్రీనివాస్, ఏ2గా అక్కపాక కుమార్కు బెయిల్ మంజూరు అయింది.
కాగా, 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి, మంథని రహదారిలోని కల్వచర్ల సమీపంలో కారులో ప్రయాణిస్తున్న గట్టు వామన్ రావు, పీవీ నాగమణి దంపతులు హత్యకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఒక్కొక్కరికి వివిధ కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. తాజాగా జైలు జీవితం గడుపుతున్న మరో ఇద్దరికి కూడా బెయిలు వచ్చింది.